పోలీసుల విజ్ఞప్తి – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాయచోటి అర్బన్ సీఐ వెంకటచలపతి సూచించారు. తమ పిల్లలను అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సమీప పోలీసులను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.వర్షం కారణంగా పోలీసు సహాయం అవసరమైతే ఈ నంబర్లకు సంప్రదించవచ్చు:9121100559, 9121100560, 100, 112. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని సీఐ తెలిపారు.