రాజమండ్రి సిటీ: చలో విజయవాడ ను జయప్రదం చేయాలని కొవ్వూరులో భవన నిర్మాణ కార్మికులు పిలుపు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 15న తలపెట్టిన చలో విజయవాడని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు మద్దుకూరి దొరయ్య పిలుపునిచ్చారు. ఆదివారం కొవ్వూరు లోని సంఘ కార్యాలయంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు సుందర బాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.