ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఎస్. బాబా ఫక్రుద్దీన్ రాయచోటి సబ్ జైలులోని లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లను పరిశీలించి ఖైదీలతో మాట్లాడి వారి కేసుల వివరాలు, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు.ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వ్యవస్థపై అవగాహన కల్పిస్తూ ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100పై ప్రచారం నిర్వహించారు.