కనిగిరి: పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా
కనిగిరి పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సోమవారం సాయంత్రం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి నాయబ్ రసూల్ మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం 12వ పిఆర్సి కమిషన్ ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు చెల్లించవలసిన నాలుగు పెండింగ్ డిఏలను తక్షణం ప్రభుత్వం చెల్లించాలన్నారు. అదేవిధంగా బోధ నేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించకుండా చూడాలని డిమాండ్ చేశారు.