సంతనూతలపాడు: పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న పేరెంట్స్ టీచర్స్ సమావేశం కార్యక్రమంలో భాగంగా నాగులుప్పలపాడు గ్రామంలో ZP హై స్కూల్ లో గురువారం మధ్యాహ్నం పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రవి కుమార్, mro ప్రవీణ్, ఎంపీడీఓ రవి, meo రవి, రమణయ్య, ప్రిన్సిపాల్ కుమారి పాల్గొన్నారు.