ఆళ్లగడ్డ: అహోబిలంలో ఘనంగా స్వాతి నక్షత్ర వేడుకలు, భారీగా తరలి వచ్చిన భక్తులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో శనివారం స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా దిగువ అహోబిల ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకులు వేణుగోపాల ఆచార్యులు సుదర్శన హోమం చేపట్టారు ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పట్టువస్తాలు పూలమాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు, భక్తులతో అహోబిల క్షేత్రం కిటకిటలాడింది, వారంతం కావడంతో ఎగువ దిగువ అహోబిల క్షేత్రాలకు బెంగళూరు హైదరాబాద్ తమిళనాడు వంటి సుధీర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు, ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు