ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో శక్తి యాప్ పై మహిళలకు అవగాహన కల్పించిన స్థానిక పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 16, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాలలోని కీలక ప్రాంతాలలో పోలీసులు మహిళలకు మంగళవారం శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యవసర సమయంలో మహిళలు ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించినట్లయితే వెంటనే పోలీసులు వారి వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారని పోలీసులు వెల్లడించారు. శక్తి టీమ్స్ మహిళలకు రక్షణ కల్పిస్తాయని విద్యార్థులకు స్కూలు విద్యార్థులకు అండగా ఉంటాయన్నారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళల పట్ల కూడా శక్తి టీమ్స్ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని పోలీసులు తెలిపారు.