నడిగూడెం: 30 ఏళ్లుగా పనిచేసిన వారిని తొలగించడం అన్యాయం: నడిగూడెంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ
ముప్పై ఏళ్లుగా ఇరిగేషన్ శాఖలో లిఫ్టులపై పనిచేసిన వారిని తొలగించడం అన్యాయమని జిల్లా రైతు కూలీ సంఘం కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. ఆదివారం నడిగూడెంలోని సీపీఎం కార్యాలయంలో ప్రభుత్వం తొలగించిన ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 సంవత్సరాలుగా పని చేసిన వారి కుటుంబాలను ప్రభుత్వం రోడ్డున పడేసిందని చెప్పారు. వారిని వెంటనే వీధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు.