డీఎస్సీ పరీక్ష ద్వారా ఎంపికై 25 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ పరీక్ష నిర్వహించడం ఇబ్బందికరమని నోబెల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు అన్నారు. రాయచోటిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉపాధ్యా యులలో ఉన్న గందరగోళ పరిస్థితికి ముగింపు పలకాలన్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసి మన వాదనలు వినిపించాలన్నారు.