విశాఖపట్నం: విశాఖ రైల్వే స్టేషన్ లో ముంబైకి తరలిస్తున్న 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాధారణ తనిఖీలలో భాగముగా, విశాఖపట్నం జి ఆర్ పి ఇన్స్పె క్టర్ సి హెచ్ ధనంజయనాయుడు గారి ఆద్వర్యం లో జి ఆర్ పి మరియు ఆర్ పి ఎఫ్ వారు సంయుక్తంగా కె టి ఆర్ లక్ష్మి మరియు, జూలీ కర్మాకర్, LSIPF/RPF/Visakhapatnam వారి సిబ్బంది తో కలిసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లలో ముమ్మర తనికీలు చేస్తుండగా గంజాం జిల్లా, ఒడిస్సా రాష్ట్రం కు చెందిన A.1. మాలతి సాహు, వయస్సు 56 సంవత్సరాలు మరియు A.2. సుమిత సాహూ, వయస్సు 35 ను విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా గంజాయి ని ముంబై, తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.