వర్షం దాటికి అతలాకుతలమవుతున్న ఆత్మకూరు పట్టణం, ఇళ్లలోకి మోకాళ్ళ లోతు నీళ్లు
మొంథా తుఫాన్ కారణంగా ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ లోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆత్మకూరు పట్టణంతో పాటు పలు మండలాలు అతలాకుతలమవుతున్నాయి. నల్లమలలో కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ నుంచి భవనాసివాగు కు వరద నీరు చేరుతుండడంతో భవనాశి వాగు, వక్కిలేరు, గుండ్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి.ఆత్మకూరు పట్టణ శివారులోని భవనాసి వాగుపొంగి పొర్లుతుండడంతో సుమారు 22గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్బంధంలో చిక్కుకొని ఆత్మకూరు పట్టణం తల్లడిల్లుతుంది. కర్నూలు -గుంటూరు జాతీయ రహదారిపై మోకాలికి పైగా వర్షపు నీరు ప్రవహిస్తుంది