అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆర్డిటి కార్యాలయం వద్ద ఉన్న శివకోటి శ్రీ పీఠంలో సోమవారం 11 నుంచి మూడున్నర గంటల వరకు మహారుద్ర శంకభిషేకం కార్యక్రమంలో భాగంగా పూర్ణహుతితో నాలుగు రోజులు పాటు నిర్వహిస్తున్న హోమాన్ని ముగించారు. ఈ సందర్భంగా అప్పు స్వామి అమర్నాథ్ మాట్లాడుతూ శ్రీ పీఠంలో నవంబర్ 14 నుంచి 17 వరకు నాలుగు రోజులు పాటు మహా రుద్ర శంకాభిషేకం శత రుద్రయాగాలను నిర్వహించడం జరిగిందని ఈరోజు మహా గౌరీ పూజతో మహా రుద్ర దీక్షను పూర్ణాహుతితో హోమాన్ని ముగించడం జరిగిందని ఆలయ వ్యవస్థాపకుడు అప్పుస్వామి అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.