హయత్నగర్ పరిధి మునుగనూరులో ఓ దొంగ రెచ్చిపోయాడు. శాంతినికేతన్ స్కూల్ దగ్గర ఉన్న ధ్రువన్ మొబైల్స్ షాప్లో ఈరోజు మధ్యాహ్నం దొంగతనానికి పాల్పడ్డాడు. రూ.70 వేలు అపహరించినట్లు సమాచారం. ఈ దొంగతనానికి సంబంధించిన విజువల్స్ సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. దొంగతనం చేసిన వ్యక్తి శ్రీ రామానుజన్ నగర్ కాలనీలో నివాసం ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.