కర్నూలు: సాహిత్యం సమాజాన్ని మార్చే ఆయుధం అవ్వాలి : రిటైర్డ్ డిజిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి
సాహిత్యమే సమాజాన్ని మార్చే ఆయుధమని సామాజిక మార్పు దిశగా ఇకమీదట కలంపోరు చేస్తానని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ డిజిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆయన రచించిన పుంజుతోక క్యాక్ టెయిల్ కవితలను సంపుటిని ఆయన తల్లిదండ్రులు కొత్తకోట చిన్నసత్యనారాయణ రెడ్డి కృష్ణవేణిలు ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య వ్యవహరించారు. భాషా సాహిత్యాలపై సాధికారత ఉన్నప్పటికీ పుస్తకాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదని ఇకమీదట సాహిత్య జీవితం సాగిస్తానని ముఖ్యంగా సాహిత్యంలోకి యువత రావాలని యువత ద్వారానే మార్పు సాధించవచ్చు అని అన్నారు. ము