ఆళ్లగడ్డ: శిరివెళ్ల నుంచి రుద్రవరానికి వెళ్లే మార్గంలో రాకపోకలకు అంతరాయం
శిరివెళ్ల మండలంలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో శిరివెళ్ల నుంచి రుద్రవరానికి వెళ్లే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అటుగా వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.