పటాన్చెరు: అమీన్పూర్ తాసిల్దార్ పై దాడి, పార్క్ తల కబ్జా వివాదం ఉద్రిక్తతకు దారి
అమీన్పూర్ మండల తహశీల్దార్ వెంకటేశ్‌పై దాడి జరిగిన ఘటన చర్చనీయంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపల్ పరిధిలోని భవానీపురం గ్రామం ప్రభుత్వ సర్వే నంబర్ 630లో సుమారు 500 గజాల పార్క్ స్థలంను అక్రమంగా ఆక్రమిస్తున్నారని స్థానికులు అధికారులు వద్ద ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా తహశీల్దార్ వెంకటేశ్ అక్రమ నిర్మాణాలను పర్యవేక్షించేందుకు అక్కడికి శనివారం చేరుకున్నారు. కబ్జాదారుడు శ్రీకాంత్ తన అనుచరులతో కలిసి MRO దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వెంకటేశ్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే సహాయక సిబ్బంది ఆయనను సురక్షితంగా తరలించారు. MRO పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.