చిన్నమండెం: నాకు ఇల్లు లేదు… సీఎం చంద్రబాబు ఇచ్చారు: లబ్ధిదారురాలు ముంతాజ్
చిన్నమండెంలో బుధవారం జరిగిన మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో లబ్ధిదారురాలు ముంతాజ్ ఆనందభాష్పాలతో మాట్లాడారు. వివాహమైనప్పటి నుంచి తాను ఇల్లులేక ఇబ్బందులు పడుతూనే ఉన్నానని, సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందించిన ఇల్లు తన జీవితంలో ఒక ఆశీర్వాదమని తెలిపారు.తన ముగ్గురు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, వారికి తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. “చంద్రబాబుగారికి నా తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి” అని ముంతాజ్ భావోద్వేగంగా అన్నారు.