బనగానపల్లె: కోవెలకుంట్ల మండలంలో తాయత్తు కొడతానని చెప్పి ఓ వ్యక్తి 50 వేల రూపాయలతో పరార్
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నెలో గురువారం ఓ వ్యక్తి మహిళను నమ్మించి రూ.50 వేల నగదుతో పరారయ్యాడు. బాధితురాలి వివరాల మేరకు.. ఖాసీంబీ ఇంటికి వెళ్లి, భర్తకు తాయత్తు కట్టాలని ఆ వ్యక్తి నమ్మించాడు. బీరువాలోని డబ్బును గూటిలో పెట్టించి, ఆమెను అంగడికి పంపాడు. ఆమె లేని సమయం చూసి నగదుతో ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు