బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో జలధార - జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండంలో నిర్వహించిన జలధార-జలహారతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రైతులా తలపాగా చుట్టుకుని, పార పట్టి స్వయంగా మట్టిని తవ్వారు. చెరువును బాగు చేయడం అంటే భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమేనని మంత్రి పేర్కొన్నారు.రైతుల శ్రమతోనే గ్రామాల్లో జలసిరి వెల్లివిరుస్తుందని ఆయన ఆకాంక్షించారు