నందికోట్కూరు: పట్టణ సమీపంలోని పగిడ్యాల రోడ్లో కారు అదుపుతప్పి గుంతలో పడ్డ కారు,చిన్నారికి తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణ సమీపంలోని పగిడ్యాల రోడ్లో కారు ప్రమాదానికి గురై బాలుడికి తీవ్ర గాయాలు, వివరాల్లోకివెళ్తే పగిడ్యాల నుంచి హైదరాబాద్ కు విష్ణువర్ధన్ దంపతులు తమ కుమారుడితో కలిసి వెళ్తుండగా,నందికొట్కూరు సమీపంలో రోడ్డుపైకి వచ్చిన పక్షిని తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పెద్ద గుంతలో పడింది, ఈ ప్రమాదంలో చిన్నారి హేమంత్ భుజం విరగడంతో చికిత్స కొరకు కర్నూలులో ప్రవేటు వైద్యశాలకు తరలించారు, పెను ప్రమాదం నుంచి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డామని విష్ణువర్ధన్ పేర్కొన్నారు, ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు