సంతనూతలపాడు: మద్దిపాడు, నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు, నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లను ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను ఎస్పీ పరిశీలించారు. మద్దిపాడు, నాగులు పొలపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ ఆదేశించారు. విజిబుల్ కార్యక్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.