తిమిరాం సంతలో కోళ్లు, మేకలకు అధిక డిమాండ్, దసరా ఉత్సవాల నేపథ్యంలో నాటు కోళ్లకు గిరాకీ
దసరా ఉత్సవాల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా వి.మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోగల దేవరాపల్లి మండలం తిమిరాం సంతలో నాటుకోళ్లు, మేకలు, గొర్రెలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 3 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు చేరి క్రయవిక్రయాలు జోరుగా సాగించడంతో ధరలు అమాంతం పెరిగాయి. నాటుకోడి ధర రూ.600 నుంచి రూ.6,000 వరకు ఉండగా, పందెం కోళ్లకు ప్రత్యేకంగా డిమాండ్ పెరిగింది. పొట్టేళ్లు కూడా మంచి రేట్లకు అమ్ముడవుతున్నాయని వ్యాపారులు తెలిపారు.