గుంతకల్లు: పట్టణంలో సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ కార్యాలయం ఎదుట సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు రిలే దీక్షలు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో సమస్యలు పరిష్కరించాలని సీపీఐ పార్టీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గత ఆరు రోజులుగా జరుగుతున్న రిలే దీక్షలలో శనివారం ఏఐఎస్ఎఫ్ నాయకులు దీక్షలలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్, నియోజకవర్గ కార్యదర్శి వెంకట్ నాయక్, పట్టణ నాయకులు శ్యాంసుందర్, శంకరప్ప, ముస్తఫా, మల్లికార్జునలు మాట్లాడుతూ గుంతకల్లు పట్టణంలో పేదలు నివసిస్తున్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం, పాలకవర్గం విఫలమైందన్నారు. పట్టణంలో రోడ్లు వెడల్పు లేక ట్రాఫిక్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు