నందికోట్కూరు: ఎర్ర మఠం, చెంచుగూడెంలో మౌలిక వసతులు కల్పించాలి: జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని ఎర్ర మఠం, చెంచుగూడెం లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు, బుధవారం చెంచుగుడాన్ని సందర్శించి ఆయన మాట్లాడుతూ చెంచుగూడెంలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి త్రాగునీరు కల్పించే విషయంలో పైప్ లైన్ వేసి కుళాయిలు బిగించారు గాని కరెంటు బోర్డు రెండు నెలల కింద కాలిపోయిన ఇంతవరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అటువైపు పోయిన పాపాన లేదని ఎక్కడో కొండల్లో నుంచి ఎర్ర మఠం గ్రామానికి వెళుతున్న నీటిని వాడుకొని కాలం ఎల్ల తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, చేపల లైసెన