ఒంగోలు అర్బన్: ఏపీ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలులో భారీ ధర్నా, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Ongole Urban, Prakasam | Apr 18, 2026
ప్రకాశం జిల్లాలో ఏపీ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలులో భారీ ధర్నా జరిగింది. విద్యారంగ సవాళ్లు, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం భవనం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ టీచర్ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల న్యాయపరమైన హక్కుల కోసం పోరాటం చేస్తామని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.