ఒంగోలు అర్బన్: కారు బీభత్సం ఒకరు మృతి మరొకరికి తీవ్రగాయాలు
Ongole Urban, Prakasam | Jul 12, 2026
ఒంగోలులోని మంగమూరు రోడ్ జంక్షన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళుతున్న కారు చెత్త ఆటోను ఢీ కొట్టి స్పీడ్ కంట్రోల్ కాక సైకిల్ పై వెళుతున్న ఏ ఆర్ కానిస్టేబుల్ మరియాదాసు ను, మరియు బైక్ పై ప్రయాణిస్తున్న మరొకరిని ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో సైకిల్ పై ప్రయాణిస్తున్న మర్యాదాసు రోడ్డుపై కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై ప్రయాణిస్తున్న మరొక వ్యక్తికి గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న రు.