నంద్యాల అర్బన్: నంద్యాలలో దారుణం,ఓ యువకుడిని వెంటపడి కత్తులతో దాడి చేసి దారుణ హత్య
Nandyal Urban, Nandyal | Apr 19, 2026
నంద్యాల మండలం ఎన్. కొత్తపల్లి మెట్ట సమీపంలో బండి ఆత్మకూరుకు చెందిన షేక్ కరిముల్లా(28)ను దుండగులు కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.. కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్య తరఫు బంధువులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.