మైదుకూరు: దువ్వూరు: రైతుల పనుల్లో ఆలస్యం సహించదు: ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
దువ్వూరు మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, రైతులకు సకాలంలో సేవలు అందించాలని అధికారులను గట్టిగా హెచ్చరించారు. పనుల్లో ఆలస్యం చేయడం సహించదని, తహశీల్దార్‌తో సమావేశమై పలు సూచనలు చేశారు. “రైతులకు న్యాయం చేయాలంటే సేవలు సమయానికి అందాలి,” అని అన్నారు.