ఉరవకొండ: బెళుగుప్ప శ్రీ విఘ్నేశ్వరస్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో సామూహికంగా సంకష్టహర చతుర్థి పూజలు
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం 8 గంటలకు భక్తిశ్రద్ధలతో సామూహిక సంకష్టహర చతుర్థి పూజా కార్యక్రమాలను భక్తజనం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు స్వామి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి మూలవిరాట్ కు పంచామృత అభిషేకాలు పుష్పాలంకరణ పూజలను నిర్వహించారు. దాతలు ఆలయం వద్ద సేవా కమిటీ సభ్యులతో కలిసి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భజన బృందం సభ్యులు ఆలయంలో భజన కార్యక్రమాలను నిర్వహించారు.