నారాయణపేట జిల్లాలో బాల్య వివాహాలను సమూలంగా నివారించి బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత గంగ్వార్ అన్నారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గురువారం 12 గంటల సమయంలో భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి ప్రసంగించారు.