జలదార కార్యక్రమం కార్యాచరణలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 7, 2026
భూగర్భ జలాల పెంపే ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్న జలధార కార్యక్రమాన్ని జిల్లాలో విజయ వంతంగా నిర్వహించేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కల్లెకర్ రాజాబాబు, అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాజాబాబు “ జలధార" కార్యక్రమం నిర్వహణ పై ఇరిగేషన్, డ్వామా, గ్రౌండ్ వాటర్, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ మరియు దాని అనుబంధ శాఖలు, సిపిడిసిఎల్ శాఖల అధికారులు, మరియు సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులతో వర్చువల్ గా సమావేశమై దిశానిర్దేశం చేసారు.