అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజవర్గం సీటీఎం వద్ద మెడికల్ కాలేజీ నిర్మాణంలో పెద్దిరెడ్డి కుటుంబం అవినీతికి పాల్పడిందని టిడిపి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు ఆరోపించారు. పెద్దిరెడ్డి కుటుంబం పై చేసిన ఆరోపణలను నిరూపించాలని మెడికల్ కాలేజ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం భారీ సంఖ్యలో చేరుకున్న వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా మదనపల్లె మెడికల్ కాలేజ్ వద్ద గొడవపడ్డారు. ఘటన స్థలం వద్ద పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.