ఉమ్మడి కడప జిల్లాలో వాయుగుండం ప్రభావం:వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 12 గంటల్లో పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో వర్షాలు తీవ్రతరమవడంతో పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది.అత్యవసర పరిస్థితుల్లో: స్థానిక కంట్రోల్ రూమ్ లేదా ఫైర్ స్టేషన్ (నంబర్ 101)కు సమాచారం ఇవ్వాలి