తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం పరిషత్ కార్యాలయంలో లింగ వివక్ష నిర్మూలనపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగ వివక్ష నిర్మూలనపై పలు అంశాలను వివరించారు. అనంతరం వెలుగు మహిళలు మహిళలపై దాడులను ఆపాలని కోరుతూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాయకులు ఏపీఎం సీసీలు పాల్గొన్నారు.