పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సోంత భవనం, 10 ఎకరాల భూమి కేటాయించాలి, విద్యార్థి సంఘాలు డిమాండ్
Panyam, Nandyal | Dec 15, 2025 పాణ్యం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తక్షణమే సోంత భవనం ఏర్పాటు చేసి, నూతన భవన నిర్మాణం కోసం 10 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్‌కుమారికి వినతి పత్రం అందజేశాయి.మూడు సంవత్సరాలుగా కళాశాల కొనసాగుతున్నా కనీస మౌలిక వసతులు, తరగతి గదులు, ల్యాబ్‌లు, తాగునీరు, టాయిలెట్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు..