కథలాపూర్: భక్తి శ్రద్ధలతో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు..భక్తుల ప్రత్యేక పూజలు
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వేములవాడ టౌన్,రూరల్,చందుర్తి,రుద్రంగి,కథలాపూర్ మేడిపల్లి,భీమారం మండలాల్లో,గ్రామాల్లో అమ్మవారిని నెలకొల్పి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఆదివారం ఏడవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంతో పాటు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చండీ సహిత హోమాన్ని సైతం నిర్వహించారు. అమ్మవారి మండపం అలంకరణతో పాటు అమ్మవారి అలంకరణ అందరిని ఆకట్టుకుంటుంది.