నరసరావుపేటలో ఆటోడ్రైవర్ సేవ లో పథకమును ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల
ఆటోడ్రైవర్ సేవలో పథకాన్ని పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ కృత్తికా శుక్ల, నియోజకవర్గ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుణుగుంట్లతో పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సొంత ఆటో క్యాబులపై ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్ల కోసం రూపొందించిన పథకంలో జిల్లా వ్యాప్తంగా 884 మంది లబ్ధిదారులకు పదిహేను వేల రూపాయలు చొప్పున నేరుగా వారి అకౌంట్లో జమ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.