డోన్: బేతంచర్ల ఎం జె పి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం
Dhone, Nandyal | Jun 27, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గోరుమానుకొండ పరిధిలోని MJP గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త అడ్మిషన్ల విషయమై మాట్లాడేందుకు పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు గంటల తరబడి వేచి ఉన్నా అధికారులు స్పందించలేదు. ప్రిన్సిపల్ భోజనం చేస్తున్నారని, విశ్రాంతి తీసుకుంటున్నారని సమాధానం చెబుతూ తోంది. తలుపులు మూసి వేస్తున్నారు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు