వేములవాడ: రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిగిరి రమేష్ ను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..ఘటన స్థలానికి వచ్చిన ASP శేషాద్రిని రెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిగిరి రమేష్ ను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శివారులో హత్య చేశారు. భూ వివాదాలే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఈ ఘటనతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ASP శేషాద్రిని రెడ్డి మీడియాతో మాట్లాడారు.