ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూగజీవాల అక్రమ తరలింపుకు అడ్డుకట్ట వేసేందుకు 53 బృందాలు ఏర్పాటు: ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | May 26, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూగజీవాల అక్రమ రవాణాలు అడ్డుకునేందుకు 53 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు ప్రకటన మంగళవారం విడుదల చేశారు. బక్రీద్ సందర్భంగా మూగజీవాలను ఆవులను దున్నపోతులను ఇతర మూగజీవాలను తరలించి వధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఎక్కడన్నా అక్రమంగా మూగజీవాలను తరలిస్తున్నట్లు గుర్తిస్తే 9121102266 నంబర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.