జహీరాబాద్: ధనసిరిలో ట్రాక్టర్ పైనుంచి వెళ్లడంతో మహిళా కూలి మృతి
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ధనసిరి గ్రామానికి చెందిన రైతు సిద్ధప్ప చెరుకు తోటలో కూలి పనులకు వెళ్లిన జహీరాబాద్ కు చెందిన లక్ష్మి పనులు నిర్వహిస్తుండగా శనివారం మధ్యాహ్నం చెరుకు తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో వెనుకకు ట్రాక్టర్ తీసుకుంటూ కూలి లక్ష్మి పై ఎక్కించడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న చిరాగ్ పల్లి పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.