ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గానికి దివంగత మంత్రి మేకపాటి లేని లోటు తీరనిది అని పేర్కొన్న వైసీపీ నాయకులు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి 55వ జయంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా బస్టాండ్లోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. పలువురు మాట్లాడుతూ.. ఆత్మకూరు అభివృద్ధికి మేకపాటి గౌతంరెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన అకాల మరణం అటు వైసీపీ, ఇటు ఆత్మకూరు నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు.