సంక్షేమ పథకాలపై ప్రజాభిప్రాయాన్ని పెంచాలి: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 1, 2026
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాలకు, అధికారులకు ర్యాంకింగ్లు ఇస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్య తాయుతంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయం పెంపుపై సమీక్ష నిర్వహించారు. అన్ని సంక్షేమ పథకాలలో కనీసం 80శాతం నుంచి గరిష్ఠంగా 95 సాధించాలని సూచించారు