నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణ శివారులో ఛత్తీస్గఢ్ కు చెందిన ఓ మహిళ అనుమానాస్పద మృతి
Nandyal Urban, Nandyal | Jun 8, 2026
నంద్యాల పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్ భవనంలో చతిస్గడ్ కు చెందిన లక్ష్మీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు లక్ష్మి రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయిందని అయితే రాత్రి 10 గంటల సమయంలో ఆమె భర్త నిద్రలేపేందుకు ప్రయత్నించగా పలకకపోవడంతో వెంటనే స్థానిక నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు గోస్పాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు