కడప: సమాజ అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర అత్యంత కీలకం: జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయడు
Kadapa, YSR | Sep 15, 2025 సమాజ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనలో ఇంజినీర్ల పాత్ర అత్యంత కీలకమని, వారి సేవలు భావితరాలకు ఎంతో అవసరం అని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సభా భవన్ లో జిల్లా గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు ఇంజినీర్స్ డే వేడుకలకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.