మధిర: కోదాడ సమీపంలోని దుర్గాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బోనకల్ మండలం గోవిందపురం కు చెందిన ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
కోదాడ పట్టణ సమీపంలోని దుర్గాపురంలో అప్పటికే బ్రేక్ డౌన్ అయి లారీ ఆగిపోయింది. దీన్ని గమనించని కారు వేగంగా వచ్చి, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.