నంద్యాల అర్బన్: గత వైసిపి ప్రభుత్వ హాయంలో దళితులకు తీవ్ర అన్యాయం : టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్
Nandyal Urban, Nandyal | May 21, 2026
నంద్యాల పట్టణంలోని దేవ నగర్ లో గురువారం డాక్టర్ సుధాకర్ సంస్మరణ సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్యఅతిథిగా నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పాల్గొన్నారు. సందర్భంగా సుధాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనం డాక్టర్ సుధాకర్ మృతిని ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు