పుంగనూరు: న్యూమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
డాక్టర్ పవన్ కుమార్.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం భీమగాని పల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ ఆవరణంలో వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్ న్యూమోనియా వ్యాధిపట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో మాట్లాడుతూ చిన్నపిల్లలలో న్యూమోనియా వ్యాధి నివారణకు న్యూమోకాకల్ టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని కోరారు. జ్వరము. జలుబు దగ్గు శ్వాసకోస తదితర వాటికి ప్రభుత్వాసుపత్రి నందు చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మురళి బాబు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.