కరీంనగర్: అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమి తమకు కేటాయించాలని నిరసన వ్యక్తం చేసిన దళితులు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి లో పాంబండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమి తమకే కేటాయించాలని దళితులు ధర్నా నిర్వహించినట్లు ఆదివారం తెలిపారు. 840, 841 సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమి నిరుపేదలైన, ఇల్లు లేని దళితులకు కేటాయించాలని స్థలాలను ఆపుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న భూమి అన్యాక్రాంతం అవుతుందని కొందరు ఆక్రమించుకుంటున్నారని తెలిపారు.విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్న వారి తో మాట్లాడి ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.