అనంతపురం అర్బన్: నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | May 1, 2026
అనంతపురం నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కర్ణాటక రాష్ట్రం కు చెందిన దుర్గేష్ అనే వృద్ధుడు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.